← Back to news

చేతబడి పేరిట.. మహిళను చెట్టుకు కట్టేసి మూకుమ్మడి దాడి

By Praveen· 10h ago· Jubilee Hills, Hyderabad, Hyderabad

ఫ్యూచర్ సిటీ అని ఒకవైపు హైదరాబాదు దూసుకుపోతుంటే కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో మూఢనమ్మకాలు రూల్ చేస్తున్నాయి. చేతబడి లేదని సైన్సు చెబుతుంటే, అదే పేరు చెప్పి ఒక మహిళమీద గ్రామస్థులంతా మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె వయస్సు 60. పేరు పల్లటి వెంకటమ్మ. ఆ ముసలామెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే 14 మంది కేసులు నమోదు చేశారు. మూఢనమ్మకాల నిరోధక చట్టం తెచ్చి ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే ఇలాంటివి కొనసాగుతూ ఉంటాయి.

More in World