యువత మోదీకి అనుకూలంగా మారిపోరు: దీప్కే

ప్రభుత్వ ఆదేశాలతో ఇన్‌స్టాగ్రామ్ వేలాది పోస్టులను తొలగిస్తోందని అభిజీత్ దీప్కే తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం పెరుగుతుండటంతో ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. పోస్టులను తొలగించినంత మాత్రాన యువత మోదీకి అనుకూలంగా మారిపోరని పేర్కొన్నారు. భారతదేశంలో 'Free Speech'(స్వేచ్ఛగా మాట్లాడే హక్కు)ను కాపాడటంలో మెటా సంస్థ విఫలమైందని కామెంట్ చేశారు.



