పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వండి: కార్తి

పోలీసులపై సోషల్ మీడియా వల్ల ప్రెజర్ పెరిగిందని నటుడు కార్తి అన్నారు. ఇంటర్నెట్‌లో ఏదైనా కేసు కనిపిస్తే.. వెంటనే సాల్వ్ చేయాలని పబ్లిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారని చెప్పారు. పోలీసులు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నా, వారికి హాలిడే ఉండటం లేదన్నారు. కోయంబత్తూరులో జరిగిన మాజీ పోలీస్ అధికారుల ట్రస్ట్ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో కార్తి మాట్లాడారు. పోలీసులకు వారానికి ఒక రోజు ఆఫ్ ఇవ్వాలని కోరారు. స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఆఫ్ తీసుకోలేకపోతున్నారని చెప్పారు.


