← Back to news

యాప్‌లోనూ కనిపించని యూరియా.. రైతుల ఆందోళన

By Ramesh Ch· 4d ago
యాప్‌లోనూ కనిపించని యూరియా.. రైతుల ఆందోళన

నర్సంపేట డివిజన్‌లో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా యూరియా కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నా సరిపడా నిల్వలు అందుబాటులో లేవని అంటున్నారు. మరోవైపు యాప్‌లో యూరియా బస్తాలను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా నర్సంపేట, ఖానాపురం ప్రాంతాల్లో యూరియా అందుబాటులో ఉన్నట్లు కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఎదుర్కొన్న యూరియా కొరత పరిస్థితి ఈ ఏడాది కూడా ఎదురుకావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More in Agriculture