ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన స్టూడెంట్!
నిర్మల్ జిల్లా భైంసాలోని గోపాలరావు పాటిల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా, ఒక స్టూడెంట్ ఓపెన్‌గా చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు. అది గమనించిన కాలేజీ ప్రిన్సిపాల్ వెంటనే అక్కడికి వచ్చి, ఆ స్టూడెంట్‌ని పట్టుకుని ఎగ్జామ్ రాయకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర కోపానికి గురైన ఆ స్టూడెంట్ అందరి ముందే ప్రిన్సిపాల్‌పై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఇన్సిడెంట్‌పై ప్రిన్సిపాల్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఆ స్టూడెంట్‌పై కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.



