← Back to news

కొత్తపేటలో మదర్ థెరీసా జయంతి

By arjun· 26 Aug 2026· Kothapeta
కొత్తపేటలో మదర్ థెరీసా జయంతి

AP : కోనసీమ జిల్లా కొత్తపేట విద్యా బాల మందిర్ స్కూల్లో మదర్ థెరీసా 116వ జయంతి వేడుకలు జరిగాయి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజు శేఖర్ థెరీసా అనాథలకు, రోగులకు చేసిన సేవల గురించి స్టూడెంట్స్‌కి వివరించారు. 10 క్లాస్ స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని 50 మంది పేషెంట్లకు పాలు, పండ్లు, బ్రెడ్ పంచారు. ఈ ప్రోగ్రామ్‌లో HM శివరత్నం, సుధాకర్, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.

More in Local