← Back to news

ఇవాళ గౌరీ లంకేశ్ వర్ధంతి

By Vishi· 1h ago
ఇవాళ గౌరీ లంకేశ్ వర్ధంతి

గౌరీ లంకేశ్ కర్ణాటకకు చెందిన జర్నలిస్టు, ఎడిటర్, సామాజిక ఉద్యమకారిణి. ఆమె తండ్రి పి.లంకేశ్ కన్నడ రచయిత, నిర్మాత. 2005లో సొంత వారపత్రిక గౌరీ లంకేశ్ పత్రికెను స్టార్ట్ చేశారు. ఇది ప్రకటనలు లేకుండా కేవలం రీడర్స్ సబ్‌స్క్రిప్షన్లు, విరాళాలతో నడిచేది. ఆమె రచనలు, ప్రసంగాలు కొందరికి వ్యతిరేకంగా మారాయి. 2017 సెప్టెంబరు 5న సాయంత్రం బెంగళూరులోని తన ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు. హిందూత్వ తీవ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారని SIT చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

More in National