లక్ష విగ్రహాలు ఫ్రీ.. ఆఫీసర్ల జేబుల్లోకి లక్షలు!

పర్యావరణ పరిరక్షణ కోసం GHMC హైదరాబాద్‌లో లక్ష మట్టి గణపతి విగ్రహాలను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయింది. దీనికోసం టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి, విగ్రహాల సైజును బట్టి రూ.32.18 నుండి రూ.220 వరకు ప్రైస్ ఫిక్స్ చేశారు. అయితే ఏటా రూ.కోటి వరకు బడ్జెట్ కేటాయిస్తున్నా, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారనే దానిపై ప్రాపర్ రికార్డ్స్ లేవు. కొంతమంది ఆఫీసర్లు, ఎంప్లాయీస్ ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షల్లో కరప్షన్‌కి పాల్పడుతున్నారని సప్లై చేసిన ఏజెన్సీలతో పాటు సిటీ ప్రజల నుండి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.



