← Back to news

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

By Vishi· 9 Oct 2026· X
కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకలుగా ప్రకటించనున్న కొత్త పథకాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తన ఎక్స్ అకౌంట్‌లో విమర్శలు చేశారు. మహాలక్ష్మి పథకం, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 1,000 రోజుల తర్వాత ప్రభుత్వం నిద్రలేచిందని అన్నారు. “ఈ రెండు పథకాల సంగతి సరే, మిగతా 418 హామీల పరిస్థితి ఏమిటి?” కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు.

More in TG