46 ఏళ్లుగా ఆ ఊళ్లో దసరా లేదు

TG: రాష్ట్రమంతా దసరా సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణలోని ఆ ఊళ్లో మాత్రం దసరా కళే ఉండదు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆ గ్రామం విజయదశమి వేడుకలకు దూరంగా ఉంది. సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలానికి చెందిన చిల్పకుంట్ల పరిస్థితి ఇది. 1980లో చిల్పకుంట్లలో దసరా సందర్భంగా గ్రామంలో కంకణం ఎవరు కట్టాలనే విషయంలో రెండు ప్రధాన రాజకీయ వర్గాల మధ్య వివాదం చెలరేగింది. కర్రలతో దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో ఇకపై గ్రామంలో దసరా వేడుకలు నిర్వహించకూడదని తీర్మానించారు.



