చిగురుమామిడిలో ఎర్రజెండా రెపరెపలు.. అమరులకు నివాళి

కరీంనగర్ జిల్లాలో 'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని' వారిని గుర్తుచేసుకుంటూ నిర్వహించిన ప్రోగ్రాంలో CPI జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. నిరంకుశ పాలన, వెట్టిచాకిరీపై రైతులు, మహిళలు తిరగబడ్డారని చెప్పారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, రేకొండతో సహా పలు గ్రామాల్లో CPI జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి అమరవీరుల స్తూపాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫ్లాగ్ హోస్టింగ్ చేసి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.



