← Back to news

బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క సందడి

By Prashanth· 1d ago

రాష్ట్ర సచివాలయం సమీపంలోని అమరజ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం వారితో కలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

More in TG