దళిత స్టూడెంట్‌పై దాడి.. పలువురిపై కేసు!

ఉత్తరప్రదేశ్, ఘాజియాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. 11th Grade చదువుతున్న దళిత స్టూడెంట్‌పై తోటి విద్యార్థులు నెల రోజులుగా కులం పేరుతో దూషిస్తూ వేదిస్తున్నారని, దాడి చేస్తున్నారని విద్యార్థి తండ్రి కంప్లయింట్ చేశారు. అక్టోబర్ 6న కొందరు విద్యార్థులు స్నేహితులను పిలిచి, తన కొడుకుని తన్నులు, గుద్దులు, బెల్టుతో కొట్టారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు పలువురిపై FIR నమోదు చేసి ఎంక్వయిరీ చేస్తున్నారు.

