విదేశీ కుట్రలు: మోహన్ భగవత్
భారతదేశాన్ని విచ్ఛిన్నం చెయ్యడానికి విదేశీ శక్తులు, ముఖ్యంగా వెస్ట్రన్ ప్రభావాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు RSS ఛీఫ్ మోహన్ భగవత్. "ఫ్రాన్స్, అల్బేనియా, బంగ్లాదేశ్, నేపాల్‌లలో హింస ద్వారా ప్రభుత్వ మార్పులు జరిగినా సమస్యలు తీరలేదనీ, అలాంటి కుట్రల్లో కొందరు రాజకీయ నేతలు భాగమవుతున్నారు" అని నాగ్‌పూర్‌లోని విజయదశమి ప్రసంగంలో ఆయన అన్నారు. అస్థిరత సృష్టించే కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన.. దేశం బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతోందన్నారు.


