నా కూతురు స్వతంత్రంగా మాట్లాడింది: కొండా సురేఖ
TG: ‘నా కూతురికి పెళ్లైంది. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు’ అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ తన భర్త మున్నూరు కాపు, తను పద్మశాలి కులానికి చెందిన వ్యక్తులమని తెలిపారు. తమకు 16 శాతం ఓట్లు ఉన్నాయని అన్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా తన శాఖను నిర్వహిస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ సైతం మహిళలు స్వతంత్రంగా ఉండాలని ఇటీవల పిలుపునిచ్చారని అన్నారు.



