← Back to news

ఆటపాటలతో సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు

By Naresh Kumar· 22h ago· Vikarabad
ఆటపాటలతో సాయిపూర్‌లో బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో ఘనంగా జరిగాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్, ఫ్లోర్ లీడర్ దీపా నర్సిములు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సతీమణి ఆర్తి రెడ్డి, తల్లి ప్రమోదినితో కలిసి హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

More in Local