← Back to news

హోం మంత్రి ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్

By RK· 25 Jul 2026
హోం మంత్రి ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్

AP: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. హోం మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. ఖాతా నుంచి అనధికారిక పోస్టులు వస్తున్నట్లు గుర్తించి, వాటిని అధికారిక ప్రకటనలుగా పరిగణించవద్దని తెలిపారు. సైబర్ దాడిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అకౌంట్ రికవరీ చేయడానికి, హ్యాకర్లను గుర్తించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

More in News