ప్రభుత్వ స్కూల్‌లో TPF పర్యటన.. విద్యార్థులతో మాటామంతీ

TG: విద్యా బస్సుయాత్రలో భాగంగా TPF బృందం కరీంనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించింది. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి స్కూల్‌లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు సేకరించారు. ప్రభుత్వ బడుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని బృందం సూచించింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం TPF ఆధ్వర్యంలో 27వ తేదీ వరకు విద్యా బస్సుయాత్ర కొనసాగుతోంది.





