ముస్లిం పర్సనల్ లా – పోక్సో చట్టం వివాదం.. చిన్మయి ట్వీట్

భారతదేశంలో ముస్లిం పర్సనల్ లా, పోక్సో చట్టం మధ్య వివాదం మళ్లీ చర్చగా మారింది. పోక్సో చట్టం ప్రకారం 18 సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయి పెళ్లి జరిగినా, తనతో లైంగిక సంబంధం ఉన్నా అది నేరం. అయితే ముస్లిం పర్సనల్ లా ప్రకారం అమ్మాయి ప్యూబర్టీకి వస్తే పెళ్లి చేసుకోవచ్చు. దీన్ని 15 సంవత్సరాల వయసుగా భావిస్తారు. దీంతో రెండు చట్టాల మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తూ ఉంది. దీని గురించి గాయని చిన్మయి శ్రీపాద్ ట్వీట్ చేశారు. ‘వైరుధ్యాలుంటే చట్టాన్ని మార్చాల్సిందే’ అన్నారు.



