← Back to news

అర్ధరాత్రి ఘోర విషాదం

By DK· 20 Aug 2026· సిద్దిపేట జిల్లా
అర్ధరాత్రి ఘోర విషాదం

TG: సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు(30), అతని భార్య భాగ్య(25), కుమారుడు నిహాల్ష్(4), కుమార్తె శాన్విక(2) సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

More in TG