← Back to news

జడ కొప్పు ఆటకు జీవం.. పల్లెలో సంబరం

By VGRAO· 1h ago· Rajanna Sircilla
జడ కొప్పు ఆటకు జీవం.. పల్లెలో సంబరం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో దశాబ్దాలుగా కనుమరుగైన ‘జడ కొప్పు’ ఆటకు విజయదశమి వేళ మళ్లీ జీవం పోశారు. అరుదైన ఈ సంప్రదాయ ఆటను నిర్వహించి గ్రామీణ సంస్కృతిని చాటారు. అంతరించిపోతున్న ప్రాచీన కళారూపం జడ కొప్పు (జడ కోలాటం) ఆటను గ్రామ సర్పంచ్ బాలరాజు నరస గౌడ్ దసరా పర్వదినాన ఘనంగా ప్రారంభించారు. కళాకారులు చేతుల్లో తాళ్లు పట్టుకుని, లయబద్ధంగా అడుగులు వేస్తూ జడను అల్లడం, తిరిగి విడదీయడం చూపరులను కట్టిపడేసింది.

More in Local