← Back to news

తాడ్వాయి TRS ప్రధాన కార్యదర్శిగా రవీందర్

By Ravi G· 54m ago· Tadwai, Tadwai, Kamareddy
తాడ్వాయి TRS ప్రధాన కార్యదర్శిగా రవీందర్

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎండ్రియాల్ గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. విజయదశమి సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

More in Local