బలవంతపు ఏకగ్రీవాలు రద్దు చేయాలి: PDM డిమాండ్
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పీపుల్స్ డెమోక్రసీ మూవ్‌మెంట్ రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణ మాట్లాడారు. నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం వంటి ఆరోపణలపై విచారణ జరిపి, అక్రమ ఏకగ్రీవాలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికలు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చట్టబద్ధంగా నిర్వహించాలని కోరారు.

