SEC ఆఫీసుకి జగన్.. దాడులపై కంప్లైంట్

AP: విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీసుకి వెళ్లిన YCP ఛీఫ్ జగన్.. తమ అభ్యర్థులపై జరుగుతున్న దాడులపై కంప్లైంట్ ఇచ్చారు. 2 రోజులుగా అనేక జిల్లాల్లో ఈ దాడులు జరిగాయని చెబుతూ.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆధారాలుగా ఇచ్చారు. తమ అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని కోరారు. మరోవైపు నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారనే అంశంతో YCP వేసిన హౌస్ మోషన్ పిటిషన్ని AP హైకోర్టు విచారణకు ఆమోదించింది.
