గవర్నర్ని కలిసిన YS జగన్

AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిశారు ప్రతిపక్ష నేత YS జగన్. YCP నేతలపై జరుగుతున్న దాడుల గురించి గవర్నర్కి కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వెయ్యనివ్వకుండా తమ అభ్యర్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని జగన్ చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో తమ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై పోలీసులు, TDP గూండాలు దాడులకు పాల్పడ్డారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది.
