అలర్ట్.. వారం పాటూ వర్షాలు

ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 12 వరకూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. నేడు (సెప్టెంబర్ 6) ఏపీ, తెలంగాణలో మాగ్జిమం ఎండ వాతావరణం ఉంటుంది. మేఘాలు ఉన్నా.. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువే. గరిష్ట ఉష్ణోగ్రత తెలంగాణలో 35 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గాలి వేగం తెలంగాణలో గంటకు 20 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 30 కిలోమీటర్లుగా ఉంటుంది. తేమ తెలంగాణలో 54 శాతంగా, ఏపీలో 44 శాతంగా ఉంటుంది.

