పాము కనిపిస్తే ఏం చెయ్యాలి?

అరుపులు, కేకలతో పామును కంగారుపెట్టొద్దు. పట్టుకునే ప్రయత్నం చేయవద్దు. స్నేక్ కొంతదూరంలో ఉంటే సైలెంటుగా వెనక్కి వెళ్లాలి. అది వెళ్లిపోయేంత వరకు దానికి దారివ్వాలి. పిల్లలు, వృద్ధులను ఆ ప్రాంతానికి దూరంగా ఉంచాలి. వెంటనే అటవీశాఖ హెల్ప్ లైన్, పాములను పట్టుకునే స్నేక్ సొసైటీలకు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి స్నేక్‌ని పట్టుకుంటారు. సొసైటీ మెంబర్స్ జనరల్‌గా అరగంట నుంచి గంటలోపు చేరుకుంటారు.<br>తెలంగాణ అటవీశాఖ టోల్ ఫ్రీ: 18004255364<br>ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ: 8374233366



