← Back to news

పాము కాటు వేస్తే ఇలా చెయ్యండి

By Krishna· 3h ago
పాము కాటు వేస్తే ఇలా చెయ్యండి

స్నేక్ కాటు వేస్తే చెట్ల మందులు, మంత్రాలు పనిచేయవు. పాము కాటేసినప్పుడు భయపడకుండా బాధిత వ్యక్తిని వెంటనే గవర్నమెంట్, ప్రైవేటు హాస్పిటల్ లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కి తీసుకెళ్లాలి. 30 నుంచి 45 నిమిషాల్లోపు చేరుకోవడం చాలా ముఖ్యం. కరిచింది విషపు పాము అయితే ఆసుపత్రిలో యాంటీవెనమ్ ఇంజక్షన్ ఇస్తారు. కాంపౌండర్లు, నర్సులతో ఇంజక్షన్ వేయించుకోవద్దు. ఒకేసారి ఎక్కువ డోస్ ఇస్తే ప్రాణాలకే ప్రమాదం. పాములు పాలు తాగుతాయన్నది అపోహే. అవి పగబట్టవు.

More in Infotainment