← Back to news

మంత్రి రాజీనామాతో సమస్యలు తీరవు

By DK· 24 Jul 2026· గుంటూరు జిల్లా
మంత్రి రాజీనామాతో సమస్యలు తీరవు

AP: నీట్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన నిందితులకు కఠిన శిక్షలు పడాలని, కోర్టుల్లో కేసులు త్వరగా పరిష్కారమైతేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 'లీప్' యాప్‌ను రూపొందించామని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక మంత్రి రాజీనామా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, వ్యవస్థలో అవసరమైన సంస్కరణలపై సూచనలు వస్తే చర్చించి అమలు చేస్తామన్నారు.

More in Education