← Back to news

రికార్డులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం: పొంగులేటి

By DK· 20 Aug 2026
రికార్డులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం: పొంగులేటి

TG: రాష్ట్రంలోని 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల పత్రాలు, గత రిజిస్ట్రేషన్లు, రికార్డులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు.

More in TG