← Back to news

'కాపాడాల్సిన MLA భూకబ్జా చేశాడు'

By Krishna· 52m ago· X

TG: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై భూకబ్జా ఆరోపణలు వస్తున్నాయి. "పోలీసులను అడ్డం పెట్టుకొని.. తమ తాతగారి భూమిని ఎమ్మెల్యే.. బినామీ పేర్లతో ఆక్రమించుకుంటున్నారు" అని బాధితులు ఆరోపించారు. దాదాపు 35 ఏళ్ల కిందట రైల్వే ఉద్యోగి కొన్న భూమిని.. ఇప్పుడు డాక్యుమెంట్లు మార్చి, కబ్జా చెయ్యాలని చూస్తున్నారని బాధితులు చెబుతున్నారు. బినామీలు తమ భూమిలోకి ఎందుకు వచ్చారని నిలదీస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తులో ఉందని చెబుతున్నారు.

More in TG