విద్యార్థుల కోసం హెల్త్ కార్డులు

TG : జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా 'స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు' తెస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ కార్డుల్లో స్టూడెంట్స్ హెల్త్ చెకప్స్, ట్రీట్‌మెంట్ వివరాలు నమోదు చేస్తారు. రక్తం తక్కువగా ఉండటం, పళ్లు, చర్మం, గుండె, కిడ్నీ సమస్యలను మొదట్లోనే గుర్తించడానికి చర్యలు తీసుకుంటారు. హెల్దీ ఫుడ్, పర్సనల్ హైజీన్‌పై అవేర్‌నెస్ ఇస్తూ, ఆరోగ్యవంతమైన విద్యార్థులే సమాజానికి పునాది అని కలెక్టర్ చెప్పారు.



