← Back to news

హైదరాబాద్‌లో భారీ వర్షం

By Krishna· 6h ago
హైదరాబాద్‌లో భారీ వర్షం

బంగాళాఖాతంలో వాయుగుండం గట్టిగానే వర్షాలు కురిపిస్తోంది. ఇది సరిగ్గా మన ఏపీ, తెలంగాణ వైపే వస్తోంది. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం దగ్గర తీరం దాటొచ్చని జూమ్ ఎర్త్ సూచిస్తోంది. దీని వల్ల ఇప్పటికే ఏపీ, తెలంగాణలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షం 2 రోజులపాటూ ఇంకా ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ.

More in Current Affairs