← Back to news

DJ సౌండ్‌తో స్కూల్‌లో స్టూడెంట్ మృతి

By Mahesh· 5h ago· UP· Uttar Pradesh

UPలోని బలరాంపూర్‌లో దారుణ ఘటన జరిగింది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో భారీ DJ సౌండ్‌తో దగ్గరలోని డివైన్ పబ్లిక్ స్కూల్‌లో 7 ఏళ్ల, 2వ తరగతి విద్యార్థిని వైష్ణవి ఒక్కసారిగా కుప్పకూలింది. టీచర్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన CCTV ఫుటేజ్ బయటకొచ్చింది. DJ సౌండ్‌కు, స్టూడెంట్ మృతికి నేరుగా సంబంధం ఉందా? అనే అంశంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కుటుంబం నుంచి ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదు.

More in National

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!
National· 2h ago

గోల్డ్ మెడల్ గెలిచిన కమలిని.. CM భారీ క్యాష్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో <a href="https://www.theclearcutnews.com/n/fD3VttH">గోల్డ్ మెడల్ సాధించిన</a> టీమిండియాకు తమిళనాడు CM అభినందనలు తెలిపారు. ఈ టీమ్‌లో ఉన్న మదురైకి చెందిన క్రికెటర్ కమలిని విజయాన్ని స్పెషల్‌గా అభినందించారు. ఆమె అద్భుత పెర్ఫార్మెన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం తరఫున 75 లక్షల క్యాష్ రివార్డ్ ఇవ్వనున్నట్లు <a href="https://x.com/CMOTamilnadu/status/2102316384906789096?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2102316384906789096%7Ctwgr%5E37487666247bbc828495a0dfb797ad4fd8a33bff%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Ftamil-nadu-government-rewards-kamalini-75-lakh-asian-games-gold-srav-1560344.html">'X'లో ప్రకటించారు.</a> కమలిని విజయం రాష్ట్ర యువత, మహిళలకు కొత్త ఇన్‌స్పిరేషన్, కాన్ఫిడెన్స్ ఇస్తుందని CM విజయ్ తెలిపారు.