10 నిమిషాల్లో అప్లికేషన్.. SBI కార్డులో కొత్త ఫీచర్!

SBI కార్డు YONO APPలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆధారంగా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐలో ఎఫ్‌డీ ఉన్న అర్హత కలిగిన కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లకుండా, ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు లేకుండా 100% డిజిటల్‌గా దాదాపు 10 నిమిషాల్లో అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. SBI Card Elite, Prime, SimplyCLICK, SimplySAVE ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.



