← Back to news

చపాతీ అడిగాడని వాతలు

By dk· 17 Aug 2026· వికారాబాద్ జిల్లా
చపాతీ అడిగాడని వాతలు

TG: వికారాబాద్ జిల్లా తాండూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భోజన సమయంలో అదనపు చపాతీ కావాలని అడిగిన ఎనిమిదో తరగతి విద్యార్థి సాయిబాలాజీపై తొమ్మిదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులు పెనంతో వాతలు పెట్టారు. విద్యార్థి గాయపడటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకున్నప్పటికీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. హాస్టల్‌లో విద్యార్థులతో వంట పనులు, బాత్‌రూమ్‌లు, వరండాలు శుభ్రం చేయిస్తున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు.

More in Local