← Back to news

వినాయకచవితిపై పీస్ కమిటి సమావేశం

By malluru chandrashekar· 56m ago· Vemsoor, Vemsoor, Khammam
వినాయకచవితిపై పీస్ కమిటి సమావేశం

TG: వినాయకచవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వేంసూరు ఎస్సై పల్లెల ప్రదీప్ సూచించారు. ఖమ్మం జిల్లా వేంసూరు పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం మతపెద్దలు, ప్రముఖులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను వివరించి, వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించాలని సూచించారు.

వినాయకచవితిపై పీస్ కమిటి సమావేశం
వినాయకచవితిపై పీస్ కమిటి సమావేశం

More in Local