విద్యార్థులకు భోజనమా.. పురుగులా?
AP: నెల్లూరు జిల్లా కలిగిరి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే అల్పాహారంలో పురుగులు కనిపించాయని తల్లిదండ్రులు ఆరోపించారు. పదే పదే ఇలాగే జరుగుతోందని విద్యార్థినులు చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు టీసీలు ఇచ్చి పంపిస్తామని సిబ్బంది బెదిరించారని వారు తెలిపారు. DEO విచారణలోనూ ఆహారంలో పురుగులు ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయినా చర్యలు తీసుకోకపోవడంపై తల్లిదండ్రులు మండి పడ్డారు.


