జగన్‌ను కలిసిన సీపీఐ నేతలు
గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఐ నేతలు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరుకావాలని జగన్‌ను ఆహ్వానించారు.


