గంజాయి అమ్మినా, Minorsకి బైక్ ఇచ్చినా జైలుకే

AP : విజయనగరం జిల్లా పెద లింగాలవలస గ్రామంలో జరిగిన 'పల్లెనిద్ర' ప్రోగ్రామ్‌లో రాజాం రూరల్ CI ఉపేంద్ర రావు మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడినా, అమ్మినా, ట్రాన్స్‌పోర్ట్ చేసినా స్పాట్‌లో కేసులు పెట్టి జైలుకి పంపుతామని స్పష్టం చేశారు. అలాగే ఏజ్ నిండని మైనర్లకు బైక్‌లు ఇస్తే వాళ్ల పేరెంట్స్‌పై కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. విలేజ్‌లో ఉమెన్ సేఫ్టీ కోసం 'శక్తి యాప్' ఎంత హెల్ప్ అవుతుందో వివరించారు. రాబోయే లోకల్ ఎలక్షన్స్ టైమ్‌లో ఎలాంటి అనవసర గొడవలకు పోకుండా ఉండాలని ఊరి జనానికి సూచించారు.



