← Back to news

ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమమే: ఆర్. కృష్ణయ్య

By dk· 21 Aug 2026· హైదరాబాద్
ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమమే: ఆర్. కృష్ణయ్య

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై జాతీయ BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. CM రేవంత్‌రెడ్డి రూ.2,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను బ్యాంకులో జమ చేసినట్లు ప్రకటించారని, ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల కాకపోతే వాటిని ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారని ప్రశ్నించారు. APలో BC విద్యార్థుల పూర్తి ఫీజులతోపాటు రూ.15వేల ఉపకార వేతనాలు అందిస్తున్నారని, తెలంగాణలోనూ అదేవిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.

More in TG