కట్రియాలలో ఘనంగా దసరా వేడుకలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో మంగళవారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ సుల్తాన్ రమ్య, ఉపసర్పంచ్ నాంపెల్లి రవీందర్ ఆధ్వర్యంలో బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య జమ్మిచెట్టు వద్దకు చేరుకొని పూజలు చేశారు. గ్రామస్థులు జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకున్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ కులమతాలు, పార్టీలకతీతంగా పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు.


