GenZలపై మాట మార్చిన కంగనా రనౌత్
మోహన్ భాగవత్ GenZలతో మాట్లాడిన తర్వాత బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ GenZలపై తన వైఖరి మార్చుకున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో వాళ్లను పొగిడారు. వాళ్లు మన దేశానికి బలం అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ద్వారా యువత ప్రభావితమవుతున్నారని చెప్పారు. దేశ యువత మన సంస్కృతికి అంబాసిడర్‌లుగా మారుతున్నారన్నారు. అయితే అల్లరి చేసే కొంతమంది వల్ల మొత్తం తరం పేరు పాడవుతోందని చెప్పారు. ఇటీవల GenZలపై విరుచుకుపడ్డ ఆమె ఇప్పుడు మాట మార్చడం చర్చగా మారింది.


