← Back to news

ట్రావెల్‌ బస్సు-కంటైనర్‌ ఢీ.. ఆరుగురు మృతి

By Mahesh· 26 Aug 2026· సూర్యాపేట జిల్లా

TG: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు (Fresh Bus) కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఆ టైమ్‌లో బస్సులో 42 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు రక్షించి కోదాడ Govt. హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పోలీసులు డ్రైవర్, క్లినర్‌పై కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in TG