← Back to news

బిర్యానీ కోసం వెళ్లి గొడవ.. మంటల్లో కాలిపోయిన కారు

By A.Ajay· 9 Oct 2026
బిర్యానీ కోసం వెళ్లి గొడవ.. మంటల్లో కాలిపోయిన కారు

TG: హైదరాబాద్‌ వనస్థలిపురంలో బిర్యానీ విషయంలో గొడవ జరిగింది. నిన్న అర్ధరాత్రి దాటాక ఆరుగురు యువకులు గ్రిల్‌ కాటేజ్‌ రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్‌ చేశారు. గంట గడిచినా బిర్యానీ ఇవ్వకపోవడంతో సిబ్బందిని అడగగా గొడవ జరిగింది. రెస్టారెంట్‌ నిర్వాహకుడు, సిబ్బంది తమపై కర్రలతో దాడి చేశారని యువకులు ఆరోపించారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి అక్కడ వదిలిన కారు మంటల్లో కాలిపోయింది. దీనిపై యువకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.

More in TG