తెలంగాణలో 315 మండలాల్లో కరువు ఎఫెక్ట్: మంత్రి తుమ్మల

వర్షాలు సరిగ్గా పడకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో 101 మండలాల్లో తీవ్రంగా, 214 మండలాల్లో మోస్తరు కరువు పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు. వర్షాల కొరతతో పంటలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రైతులకు సాయం అందించేందుకు 1,986.89 కోట్ల రూపాయల ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరింది.


