చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి

AP: రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందారు. బ్రెయిన్‌డెడ్ కావడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యంమత్తులో ఉన్న సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ <a href="https://www.theclearcutnews.com/n/BNi4iQK">ర్యాష్ డ్రైవింగ్</a> చేస్తూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను రాజమహేంద్రవరంలో కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కిమ్స్‌లో చికిత్స అందించారు. నిందితులను పోలీసులు <a href="https://www.theclearcutnews.com/n/ontXSYW">అరెస్ట్</a> చేశారు.



