← Back to news

మల్దకల్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు

By ARJUN· 1h ago
మల్దకల్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు

TG: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, బస్‌స్టాండ్‌ వద్ద వంటావార్పు చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి 1000 రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకోవడాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుబట్టారు.

మల్దకల్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు
మల్దకల్‌లో బీఆర్‌ఎస్‌ వంటావార్పు

More in Local