← Back to news

పశువుల అక్రమ తరలింపుపై పోలీసుల దాడులు

By Srikanth Goud· 1h ago· Jagitial
పశువుల అక్రమ తరలింపుపై పోలీసుల దాడులు

TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి మార్కెట్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 57 పశువులు, 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ పశువుల తరలింపుపై సమాచారం అందడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

పశువుల అక్రమ తరలింపుపై పోలీసుల దాడులు

More in Local