← Back to news

తెలంగాణ యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

By Nani Eluri· 1d ago· Andhrajyothy
తెలంగాణ యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీలో 252, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో చెరో 49, పాలమూరు యూనివర్సిటీలో 45 పోస్టులు ఉన్నాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల్లో చెరో 16, తెలంగాణ యూనివర్సిటీలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు త్వరలో వచ్చే అవకాశం ఉంది. అప్లై చేసే తేదీలు, అర్హతలు నోటిఫికేషన్‌లో తెలుస్తాయి.

More in TG